Rajinikanth Health Update : బేగంపేట ఎయిర్‌పోర్టులో చార్టెడ్ ఫ్లైట్ సిద్ధం
Rajnikanth’s health condition stable : హై బీపీతో అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీ (Rajinikanth) అభిమానులకు వైద్యులు శుభవార్త అందించారు. రజనీకాంత్ కు సంబంధించిన అన్ని రిపోర్టులు నార్మల్ గా ఉన్నాయని… అపోలో ఆసుపత్రి (Apollo Hospital) హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం మరోసారి వైద్యులు పరీక్షించిన తర్వాత రజనీ డిశ్చార్జ్ పై నిర్ణయం తీసుకుంటారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అటు ఆదివారం సాయంత్రం రజనీ డిశ్చార్జ్ అవుతారన్న వార్తలొస్తుండడంతో… బేగంపేట విమానాశ్రయం (begumpet airport)లో ఆయన చార్టెడ్ ఫ్లైట్‌ను సిద్ధం చేస్తున్నారు సిబ్బంది. ఈ సాయంత్రం 6 గంటలకు బేగంపేట నుంచి చెన్నై బయలుదేరుతారని రజనీ సిబ్బంది చెబుతున్నారు. రజిని డిశ్చార్జ్ : – సూపర్ స్టార్ రజినీకాంత్ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ హైదరాబాద్ అపోలో ఆస్పత్రి యాజమాన్యం (Apollo Hospital) ప్రకటించింది. హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేసింది. బీపీ అదుపులోనే ఉందని… ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళనరమైన అంశాలు లేవని గ...